Talasani srinivas yadav shadnagar abnb

తలసాని శ్రీనివాస్ యాదవ్

తలసాని శ్రీనివాస్ యాదవ్తెలంగాణ రాష్ట్రరాజకీయ నాయకుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.[2] గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.[3]

జననం

[మార్చు]

తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965, అక్టోబరు 6న సికింద్రాబాద్, మోండా మార్కెట్ లోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేశ్‌యాదవ్, లలితాభాయి దంపతులకు జన్మించాడు.

ఆయన తండ్రి వెంకటేష్‌యాదవ్ మోండా మార్కెట్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

వివాహం - పిల్లలు

[మార్చు]

శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Ernst friedrich fun schumacher biography of christopher

రాజకీయ జీవితం

[మార్చు]

1986లో రాజకీయ అరంగ్రేటం చేసి, 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసిహెచ్‌కు కార్పోరేటర్‌గా పోటీ చేసి జనతా దళ్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు.[4] 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందాడు.

1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008 జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు.

Tv actress adaa caravansary biography

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో ఓటమి చెందాడు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు.[5] తరవాత జరిగిన పరిణామాలతో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ముఖ్యమంత్రికె చంద్రశేఖర రావు మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, కెసిఆర్ మంత్రిమండలిలో పశుసంవర్థక శాఖ మంత్రిగా నియామకమయ్యాడు.[6]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక, కార్మికశాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు.

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నాడు.[7][8][9][10] ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించడం కోసం ప్రభుత్వం 12.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్‌, ఫుడ్‌ కోర్టును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.

శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 మే 03న ప్రారంభించారు.[11][12]

ఎన్నికల చరిత్ర

[మార్చు]

సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1994ఆంధ్రప్రదేశ్ శాసనసభసికింద్రాబాద్తెలుగుదేశం పార్టీ45,358మేరీ రవీంద్రనాథ్ భారత జాతీయ కాంగ్రెస్24,897 గెలుపు
199979,13041,607 గెలుపు
200453,930 టి.

పద్మారావు గౌడ్

తెలంగాణ రాష్ట్ర సమితి56,997ఓటమి
2008^ 50,031పిట్ల కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్31,964 గెలుపు
200940,668 జయసుధ45,063ఓటమి
2014తెలంగాణ శాసనసభసనత్‌నగర్56,475దండె విఠల్తెలంగాణ రాష్ట్ర సమితి29,014 గెలుపు
2018తెలంగాణ రాష్ట్ర సమితి66,464కూన వెంకటేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ35,813 గెలుపు

మూలాలు

[మార్చు]